హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 48 గంటలపాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 పథకంలో భాగంగా ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో వాల్వ్ మార్పిడి పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ఈపనులు జరుగుతాయని తెలిపారు.