అన్నమయ్య: రైల్వే కోడూరులో వామపక్షాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. ఈ మేరకు దేశ ప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు, వీసాలపై కఠిన నిబంధనలు విద్యార్థులు, రైతులు, కార్మికులకు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, దీనిపై మోడీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.