MNCL: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి జలాశయం నిండు కుండలా మారింది. ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవల్‌కు గాను 147.08 మీటర్లుగా ఉంది. 20.175 TMC లకు గాను 20.175తో ఉంది. 1,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అంతే అవుట్ ఫ్లో కింద రెండు గేట్లు తెరిచి 1,500 క్యూసెక్కుల నీరును గోదావరిలోకి వదులుతున్నారు.