JGL: వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని పార్వతి కోటేశ్వర స్వామి ఆలయం ఆదివారం చంద్ర గ్రహణం సందర్భంగా మధ్యాహ్నం మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున స్వామి వారికి పూజలు, శాంతి హోమం జరిపి ఆలయాన్ని శుద్ధి చేసి తెరిచారు. సోమవారం కావడంతో కోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని ఆలయ అర్చకులు తెలిపారు.