VZM: కొత్తవలసలోని శ్మశానం వాటిక ఎదురుగా ఉన్న మాజీ సర్పంచ్ ఇంటి వద్ద కాలువను శాశ్వతంగా మూసివేయడంతో రోడ్డు మీద నీరు ప్రవహిస్తుంది. దీంతో నడకదారిన వెళ్ళేవారు, పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మండల అధికారులు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తూన్నా పట్టించుకోకపోవడం గమనార్హం. పంచాయతీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.