VZM: చంద్రగ్రహణం నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని తిరిగి సోమవారం ఉదయం వేద పండితులు, అర్చకులు సంప్రోక్షణ చేసి 8.30 నిముషాలకు గుడిని తెరిచి అమ్మవారి దర్శనాన్ని భక్తులకు కల్పించారు. అమ్మవారికి వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అర్చనలు గావించి అనంతరం భక్తులకు తీర్ధ, ప్రసాదాలను అందజేశారు.