NDL: కోవెలకుంట్ల విక్కి ఫౌండేషన్ వ్యవస్థాపకులు విక్కీ గోపి రెడ్డి మరోసారి తన గొప్ప మనుసును చాటుకున్నారు. నంద్యాలలో పర్యటిస్తున్న నేపథ్యంలో దివ్యాంగుడు ఆశీర్వాదం నేల మీద పాకుతూ కష్టపడుతున్న దృశ్యాన్ని గమనించారు. వెంటనే స్పందించి ఆయనకు ట్రై సైకిల్ అందజేయాలని నిర్ణయించారు. ఈ తరుణంలోనే ఆదివారం ట్రై సైకిల్ అందజేశారు. మదర్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.