చిత్తూరు: ఐరాల మండలం చినకాంపల్లె గ్రామంలో ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాణిపాకం పీహెచ్సీ వైద్యాధికారి స్వాతిసింధూర తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం గర్భిణులకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇస్తామన్నారు.