కృష్ణా: పామర్రులోని నాలుగు రోడ్ల సెంటర్లో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో పామర్రు జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్‌కు చెందిన స్వీట్ షాప్ పూర్తిగా కాలిపోయింది. నిత్యం జనంతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు.