BHPL: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం 6 గంటలకు 3,30,800 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు 2,09,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో తగ్గింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతోందని, పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.