NTR: గంపలగూడెం మండలం గుళ్ళపూడి గ్రామంలో యూరియా కోసం రైతులు సోమవారం ఉదయం నుంచి సొసైటీ వద్ద బారులు తీరారు. కొద్దిపాటి యూరియా కోసం రైతులు పనులు మానుకొని వారాల తరబడి ఎదురుచూస్తున్నా, అధికారులు సమయపాలన పాటించడం లేదని ఆరోపించారు. కొందరు రైతులు చెప్పులను లైన్లో పెట్టి వెళ్లే పరిస్థితి నెలకొంది.