మేడ్చల్: బోడుప్పల్ అంబేద్కర్ నగర్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న తల్లీకొడుకును స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఊరుకు వెళ్లి తిరిగి వచ్చే లోపు మూడు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. అనుమానస్పదంగా సంచరిస్తున్నదుర్గేష్ నిలదీయగా నిజం బయటపడింది. అతని వద్ద నుంచి 2తులాల బంగారం, వెండి, ల్యాప్టాప్, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.