SKLM: సారవకోట మండలం చీడిపూడిలో ఉన్న బసవన్న చెరువు డంపింగ్ యార్డ్‌ను తలపిస్తుంది. స్థానిక పంచాయితీలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని స్థానిక గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామస్తులు పలు కార్యక్రమాలకు బసవన్న చెరువును ఉపయోగించుకుంటున్నారని ఈ క్రమంలో వ్యర్ధాలను వేయడం వలన పరిశుభ్రత కోల్పోయే పరిస్థితి వస్తుందని వివరించారు.