SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని దద్దనాల చెరువు కాలనీ రోడ్డు,చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తుంది. అధ్వానంగా ఉన్న రహదారిని సంబంధిత అధికారులు మరమ్మతులు చేపించాలని సోమవారం స్థానికులు అధికారులను కోరారు. వర్షం వస్తే ఈ రహదారిలో ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.