GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏపీ ప్రభుత్వం ఆదేశించిన విజిలెన్స్ విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల భూముల కొనుగోలులో అక్రమాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటాలు, మట్టి తవ్వకాలలో అవకతవకలు చేశారనే ఆరోపణలపై విచారణ జరగనుంది. అంబటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఈ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.