KNRL: ఎమ్మిగనూరులో శివ సర్కిల్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలుని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. దీంతో ఆ వృద్ధురాలు రెండు రోజులుగా రోడ్డుపక్కనే ఆహారం కోసం ఎదురుచూస్తూ జీవించింది. ఈ విషయం తెలిసుకున్న వేదాస్ సంస్థ సభ్యులు సునీల్ కుమార్, చికెన్ బాషా ఆమెను ఆదరిస్తూ ఆదోనిలోని జీవన జ్యోతి ఆశ్రమానికి చేరవేశారు.