NLG: లబ్ధిదారులే స్వయంగా తమ ఇండ్ల నిర్మాణ దశలను అప్లోడ్ చేసుకుని లబ్ధి పొందే విధంగా అధికారులు ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఉన్న ప్రక్రియలో ఆలస్యం అవుతుండడంతో లబ్ధిదారులకే అప్లోడ్ అవకాశం కల్పించారు. లబ్ధిదారులు మొబైల్ ఫోన్లో ఇందిరమ్మ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని లాగిన్‌కు వెళ్లి పేరు, మొబైల్ నెంబర్, గ్రామం వివరాలు నమోదు చేయాలి.