W.G: ఏడాదిలో రూ.1,200కోట్ల అవినీతి జరిగిందన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సవాల్ విసిరారు. తణుకులో ఆయన మాట్లాడుతూ.. రూ.1,200కోట్లు కాదు.. దమ్ముంటే అందులో కనీసం రూ.12 అవినీతి జరిగిందని ఆధారాలతో నిరుపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో కారుమూరి చేసిన అవినీతి రికార్డులో ఉందన్నారు.