NLG: కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన మృతదేహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యం కల్పించారు.