SRCL: గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం నుంచి కోలమద్ది వెళ్లే ప్రధాన రహదారిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతికి కాజ్వేపై భారీ గుంత ఏర్పడింది. భారీ గుంతతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి గుంతను పూడ్చి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు.