SKLM: విద్యార్థుల సామర్థ్యాలు మరింత మెరుగుపడాలని ఎంఈవో బమ్మిడి మాధవరావు సూచించారు. జలుమూరు మండలం బసివాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించారు. మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం తప్పనిసరిగా మెనూ ప్రకారమే అమలు చేయాలన్నారు.