SKLM: జి.సిగడాం మండలం నడింవలస రైతు సేవా కేంద్రాన్ని సోమవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆందోళన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు.