ADB: ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో వర్షపునీటిని నిల్వ చేసి ఉంచవద్దని, దీనివల్ల దోమలు తయారై జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్ఈఓ పవార్ రవీందర్ అన్నారు. సోమవారం నేరడిగొండ మండల కేంద్రంలో డ్రైడే నిర్వహించారు. వివిధ వ్యాధులు, జ్వరాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్త రజిని, సంధ్య రాణి పాల్గొన్నారు.