VKB: తాండూరు నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. తాండూరులోని ఎల్మాకన్న సొసైటీ వద్ద, యాలాల మండల కేంద్రంలో సోమవారం ఉదయం 6గంటల నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఎల్మాకన్న సొసైటీలో కేవలం 250 బస్తాలు మాత్రమే ఉండటంతో ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇస్తామని అధికారులు తెలిపారు. సరిపడ యూరియా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందన్నారు.