WGL: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలోని శివునిపల్లికి చెందిన కవయిత్రి, కార్టూనిస్ట్ నెల్లుట్ల రమాదేవి కాళోజీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆదివారం రాత్రి ఈ విషయం తెలిసినట్లు ఆమె తెలిపారు. అందెశ్రీ కమిటీ ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా పురస్కారం ప్రదానం చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.