HYD: గణేష్ నిమజ్జనం తర్వాత రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి GHMC ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుమారు 800 మంది పారిశుద్ధ్య కార్మికులను మూడు షిఫ్టుల్లో పనిచేయిస్తూ, 18 వాహనాలు, 3 జేసీబీలతో 1100 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. ముఖ్యంగా ఎంజే మార్కెట్ నుంచి లిబర్టీ వరకు పెద్ద ఎత్తున పేరుకుపోయిన వ్యర్థాలను క్లీనింగ్ చేస్తున్నారు.