JN: ప్రథమ చికిత్సలకు పరిమితమవుతున్న నానుడికి భిన్నంగా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో నార్మల్ డెలివరీ ప్రత్యేకతను సంతరించుకుంది. పెద్ద మడూర్ గ్రామానికి చెందిన గోకారపు కావ్య పురిటి నొప్పులు రావడంతో సింగరాజుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆసుపత్రికి ఆదివారం తరలించారు. ఆమెకు ఆసుపత్రి సిబ్బంది నార్మల్ డెలివరీ చేశారు. వైద్యులను పలువురు అభినందించారు.