SDPT: అక్బర్పేట్ భూంపల్లిలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట తెల్లవారుజాము నుంచి వందలాదిమంది బారులు తీరారు. ఒక లోడు యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడడంతో కాసేపు తోపులాట జరిగింది. అలాగే సిద్దిపేట్ మెదక్ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు.