SRD: జిన్నారం మండలం ఐడిఎ బొల్లారం మున్సిపల్ పరిధిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. జయప్రకాష్ (22) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం శవాన్ని అతని ఇంటి ముందు పడేశారు. ఒంగోలు ప్రాంతానికి చెందిన మృతుడు మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.