KDP: పులివెందుల రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి మద్యం మత్తులో కత్తితో హల్చల్ చేశాడు. అతను రన్నింగ్లో ఉన్న బస్సును వెనుక నుంచి ఎక్కడానికి ప్రయత్నించాడు. గమనించిన ఓ వ్యక్తి అలా కదిలే బస్సు ఎక్కితే ప్రాణాలు పోతాయని మందలించాడు. దీంతో కోపోద్రిక్తుడైన మద్యం బాబు అతని దగ్గర ఉన్న కత్తి తీసుకుని వెంటపడ్డాడు.