ATP: అనంతపురం జిల్లా R & B గెస్ట్ హౌస్ వద్ద ఉద్యోగ సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండ్లురి నాగభూషణ్ రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ని కలిశారు. గ్రేటర్ రాయలసీమలో ఈడిగల కుల ధ్రువీకరణ పత్రంలో గౌడ్(ఈడిగ) రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా రావాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.