KMR: బిక్కనూర్ శివారులోని దక్షిణ కాశీగా పేరుగాంచిన సిద్ది రామేశ్వర ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. సోమవారం ఆలయ ప్రధాన అర్చకుడు రామగిరి శర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ప్రత్యేక పూజలు, మంత్రోచ్చారణలతో ఆలయ వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది.