TG: వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రానికి మరో 30 వేల టన్నుల యూరియా వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ఆరు రోజుల్లో 33 వేల టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. దేశీయ యూరియా ఉత్పత్తి 30 శాతం ఉన్నప్పటికీ, కేంద్రానికి సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన విమర్శించారు.