KMM: వైరా మండలం గండగలపాడు గ్రామంలో ఆదివారం కోతుల దాడిలో ఒక మహిళకు గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన ఇనుపనూరి దేవమ్మ తన ఇంటిలో పని చేస్తుండగా, కోతులు ఒక్కసారిగా లోపలికి చొరబడ్డాయి. ఈక్రమంలో అవి ఆమె కుడి చేతిపై దాడి చేసి గాయపరిచాయి. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, అధికారులు స్పందించి త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు.