అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బొప్పాయి ధరలను నిర్ణయించామని మండల రెవెన్యూ అధికారి అమర్నాథ్ తెలిపారు. గరిష్ఠంగా కిలో రూ.8, కనిష్ఠంగా రూ.7 చొప్పునే వ్యాపారులు, దళారులు కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. ఇకపై ధరలను కలెక్టరే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. అనంతరం రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.