అన్నమయ్య: గాలివీడు మండలంలోని వెలిగల్లు జలాశయం గరిష్ఠ సామర్థ్యం 4.64 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వలు 2.40 టీఎంసీలుగా ఉన్నాయని అధికారులు తెలిపారు. పాపఘ్ని నది ఎగువ ప్రాంతంలో వర్షాభావం కారణంగా నీటి మట్టం తగ్గింది. అయినప్పటికీ కుడి కాలువకు 125 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 2 క్యూసెక్కులు, రాయచోటి, గాలివీడు రక్షిత మంచినీటి పథకాలకు రోజూ 6 క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యనున్నారు.