MDK: చేగుంట మండలం అనంతసాగర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాయంపేట మండలం శివాయపల్లికి చెందిన రామొల్ల సాయితేజ్ గౌడ్ (22) మృతిచెందగా నలుగురుకు గాయపడ్డారు. నరేష్, ప్రణయ్, స్వామి, తేజాలతో కలిసి కర్నాల్ పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద విందుకు వచ్చి కారులో తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయితేజగౌడ్ మృతి చెందాడు.