సత్యసాయి: ధర్మవరం వివేకానంద డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి. ఉదయ్ కిరణ్ గత వారం బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్ళాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఉదయ్ కిరణ్‌ను, చేనేత మగ్గం నేస్తూ తల్లి లక్ష్మీదేవి పోషిస్తోంది. వైద్య ఖర్చుల కోసం దాతల సహాయాన్ని ఆమె కోరింది.