GNTR: బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం భక్త అంబరీష హరికథా గానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆదిభట్ల కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సప్పా భారతి హరికథను ప్రారంభిస్తూ.. శ్రీమన్నారాయణుడి పట్ల అతని అచంచలమైన భక్తి, ఏకాదశీ వ్రత మహత్యం గురించి వివరించారు. ఈ హరికథకు జగన్మోహిని మృదంగం, చావలి శ్రీనివాస్ వయోలిన్ సహకారం అందించారు.