MBNR: జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు సోమవారం 16 మంది రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చారు. మొక్కజొన్న 381 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ట ధర రూ.2205 లభించగా, కనిష్ట ధర రూ.1609 లభించింది. ఆముదాలు 14 క్వింటాలు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ట ధర రూ.6001 కనిష్ట ధర రూ.5880 లభించింది.