ADB: త్వరలోనే భూ సమస్యలు పరిష్కరించి, పట్టాలు అయ్యేలా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అన్నారు. సోమవారం భీంపూర్ మండలంలోని వడూర్ గ్రామస్తులు నెరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే ను కలిశారు. గ్రామంలో ఉన్న భూ సమస్యలను వివరించారు. 40 ఏళ్లుగా భూ పట్టాలు లేవని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే పనులు పూర్తి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.