MBNR: తెల్లవారుజాము నుంచి యూరియా కోసం క్యూ లైన్లో ఉన్న రైతులకు కనీసం త్రాగేందుకు మంచినీళ్లు అందించాలని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బోయిన్పల్లి రైతు సేవా యూరియా కేంద్రాన్ని మాజీమంత్రి సోమవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. సరిపడా స్టాక్ తెప్పించుకొని ఎకరాకు రెండు యూరియా బస్తాలు రైతులకు అందించాలని అధికారులకు ఆయన సూచించారు.