NRPT: పట్టణంలో సోమవారం జరిగే మిలాద్-ఉన్-నబీ ర్యాలీ ముస్లిం సోదరులు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. ర్యాలీ జరిగే రోడ్డు వెంబడి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, పోలీసులకు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ సమస్య రాకుండా వాహనాలను డైవర్షన్ చేస్తామని అన్నారు. ర్యాలీ శాంతియుతంగా జరిగేలా ముస్లిం కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.