KNR: శంకరపట్నం మండలంలోని ఓ గ్రామంలో వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. గత కొన్ని నెలల నుంచి సదరు వివాహిత పుట్టింట్లోనే ఉంటుందన్నారు. గత నెల 22న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.