CTR: పుణ్య క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం ఆలయాన్ని సిబ్బంది శుద్ధిచేసి గ్రహణ నివారణ దోష పూజలను చేశారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు చంద్రగ్రహణ సంప్రోక్షణ పూజలతో పాటు కైంకర్యాలు చేపట్టారు. అనంతరం యధావిధిగా భక్తులకు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని ఈవో పేర్కొన్నారు.