ప్రకాశం: గిద్దలూరు మండలం నల్లబండ బజారుకు చెందిన షేక్ బేగ్ మునిషా అనే మహిళ మూడు సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతూ మంచం పట్టింది. భర్తను కోల్పోయి, సహాయం చేసేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె, నెలకు 9 వేల రూపాయల వైద్య ఖర్చుల కోసం దాతల సహాయం కోరుతోంది. సహాయం చేయాలనుకునేవారు 9848965153 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం అందజేయాలి అని కోరుతున్నారు.