AP: లిక్కర్ కేసులో నిందితులకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ధనుంజయ, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పకు ACB కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్‌ను సవాలు చేస్తూ సిట్ అత్యవసరంగా హౌజ్ మోషన్ పిటిషన్లు వేసింది. వీటిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసేందుకు బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నట్లు సిట్ వర్గాలు తెలిపాయి.