ATP: వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి సమీపంలోని హంద్రీనీవా కాలువలో గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన నాగిరెడ్డి అనే యువకుడు గల్లంతయ్యాడు. నాగిరెడ్డి, తన మిత్రుల కలిసి గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువలో స్నానం చేసేందుకు వెళ్లిన నాగిరెడ్డి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. అతని మిత్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.