VSP: విశాఖపట్నం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లిపురం నీలమ్మ వేపచెట్టు ప్రాంతానికి చెందిన బొంత అప్పలరాజు (55) అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం ఉదయ స్థానికులు మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.