ATP: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో సత్య సాయి శత జయంతి ఉత్సవాలకు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం (ఎన్ఎస్పీ ఎన్) రైల్వే స్టేషన్‌లో తాత్కాలికంగా నిలపాలని రైల్వేశాఖ నిర్ణయించింది.మరికొన్ని రైళ్లను ఆ స్టేషన్ మీదుగా మళ్లిస్తామని రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. నవంబరు నెలలో వీటిని ఎస్ఎన్ఎన్‌లో రెండు నిమిషాలు ఆపుతామని తెలిపారు.
NTR: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధి రామవరప్పాడు గ్రామంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు నిర్వాహకురాళ్లు, ఒక విటుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పటమట పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
కృష్ణా: గుడివాడ తాలూకా స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో ఫిబ్రవరి 13న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రామకృష్ణ విశ్వనాథ్ ఇంటి తాళాలు పగులగొట్టి, రూ. 25 వేల విలువైన టీవీ, వెండి చెంబు, హోమ్ థియేటర్ స్పీకర్లు దొంగిలించిన కేసులో శ్యామ్, సాయి, ధనుష్ అనే ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
GNTR: కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ధనేకుల సుబ్బారావును తుళ్లూరు మండలం నేలపాడుకి చెందిన టీడీపీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు సుబ్బారావుతో గ్రామంలోని సమస్యలు, పలు రాజకీయ అంశాలపై చర్చించారు. కాగా, ధనేకుల సుబ్బారావు నేలపాడుకి చెందినవారు కావడం విశేషం.
కృష్ణా: కంకిపాడు మండలం పునాదిపాడు, ప్రొద్దుటూరు గ్రామాలలో జిల్లా వ్యవసాయధికారి ఎన్. పద్మావతి బుధవారం పర్యటించారు. యూరియా సరఫరా సక్రమంగా ఉండేలా సిబ్బందికి సూచనలు ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఉప్పులూరు, పునాదిపాడు, మంతెన, కోలవెన్ను, తెన్నేరు, నెప్పల్లి సోసైటీలకు 15 టన్నుల యూరియాను పంపిణీ చేశారు.
TPT: పిచ్చాటూరు మండలానికి చెందిన కె.వి. భాస్కర్ నాయుడు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలక బాధ్యత తనపై ఉంచిన విశ్వాసానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణా: ఉంగుటూరు మండలం ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో 19–45 ఏళ్ళ పురుషులకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు రేషన్ ఆధార్ కార్డు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ శిక్షణా కాలంలో ఉచిత మెటీరియల్, భోజనం వసతి సదుపాయాలు ఉంటాయని అన్నారు.
KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 SKR నగర్ గ్రామంలో ఇవాళ రాత్రి చోరీలపై ఒంటిమిట్ట సీఐ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. CI మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చోరీల నియంత్రణ కొరకు CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారం వెంటనే తెలపాలన్నారు. కొత్త వ్యక్తులకు గృహాలు అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు.
CTR:కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని బుధవారం ఆలయ పునర్నిర్మాణ,బంగారు వాకిలి, వెండి వాకిలి దాత గుత్తికొండ శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. ఈ.వో పెంచల కిషోర్ వారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.
అన్నమయ్య: కలకడ మండలం కొత్తపల్లిలో గట్టు వెంకటరమణ, ప్రసాద్ రెడ్డి కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ విషయమై తగాదాల నడుస్తున్నాయి. ఈ విషయమై గట్టు వెంకటరమణ కుమారుడు ప్రవీణ్, ప్రసాద్ రెడ్డి ఘర్షణ పడ్డారు. ఇందులో ప్రవీణ్ (25)కి తీవ్ర గాయలయ్యాయి. అతడిని బంధువులు వాయల్పాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న కలకడ సీఐ లక్ష్మన్న కేసు నమోదు చేశారు.
W.G: ఆటో డ్రైవర్లకు అనంతపురం సభలో నారా చంద్రబాబునాయుడు వాహన మిత్ర పథకం ద్వారా దసరాకు సంవత్సరానికి 15వేలు ఇస్తానని ప్రకటించడంపై ఆకివీడు ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
AKP: రోలుగుంట మండలంలో ఉన్న నల్లరాయి క్వారీల నుంచి అధిక బరువుతో వాహనాలు తిరగడం వల్ల ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సుమారు 50 టన్నుల బరువుతో ప్రతిరోజు వాహనాలు తిరుగుతున్న మైనింగ్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలో ఉపాధి హామీ పథకం కింద 445 ఇంకుడు గుంతలు మంజూరైనట్లు ఏపీవో శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో డీఎల్‌డీవో, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస రెడ్డి సోక్ పిట్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటివరకు 168 ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు.
NTR: విజయవాడలో ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో బుధవారం 27వ డివిజన్ గులాబీ తోట అన్న క్యాంటీన్ సమీపంలోని అమరావతి వాకర్స్ క్లబ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 500 మంది మహిళలు పాల్గొన్నారు. “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన”పై అవగాహన కల్పిస్తూ సోలార్ ఎనర్జీ వినియోగం ద్వారా విద్యుత్ ఆదా చేయగల ప్రయోజనాలను వివరించారు.